Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహ్మదాబాద్‌లో ఐపిఎల్ ఫైనల్
- అధికారికంగా ప్రకటించిన బీసీసీిఐ
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ప్లే-ఆఫ్స్, ఫైనల్స్ వేదికలను బిసిసిఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. మే 24, 25న కోల్‌కతాలో ప్లే-ఆఫ్స్ రెండు మ్యాచ్‌లు జరగనుండగా.. 27, 29న క్వాలిఫయర్-2, ఐపిఎల్ మెగా ఫైనల్ 27, 29న అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అధికారికంగా ప్రకటించారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సిఏబి) అధ్యక్షులు అవిషేక్ ధాల్మియా ప్లే-ఆఫ్‌కు కోల్‌కతా ఆతిథ్యమివ్వాల్సింది బిసిసిఐ నుంచి లేఖ అందినట్లు తెలిపారు.
ఐపిఎల్ ప్లే-ఆఫ్స్‌కు మ్యాచ్‌లకు సంబంధించి సోమవారం సౌరవ్ గంగూలీ అధ్యక్షతన సమావేశం జరిగిందని, నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్ర సంఘాలకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు. ప్లే-ఆఫ్ మ్యాచ్‌లకు 100% ప్రేక్షకులను అనుమతించాలని చూస్తున్నామని, ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉందని గంగూలీ తెలిపారు.
ఐపిఎల్ ప్లే ఆఫ్..
మే 24 : క్వాలిఫయర్-1 (ఈడెన్‌గార్డెన్స్-కోల్‌కతా)
మే 25 : ఎలిమినేటర్ (ఈడెన్‌గార్డెన్స్-కోల్‌కతా)
మే 27 : క్వాలిఫయర్-2(నరేంద్ర మోడీ స్టేడియం-అహ్మదాబాద్)
మే 29 : ఫైనల్ (నరేంద్ర మోడీ స్టేడియం-అహ్మదాబాద్)