Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ 144, బెంగళూరు 115ఆలౌట్
- బౌలింగ్‌లో మెరిసిన కుల్దీప్ సేన్, అశ్విన్ మ్యాజిక్
ఎంసిఏ(పూణే): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. తొలుత బెంగళూరు బౌలర్లు సంయుక్తగా చెలరేగడంతో రాజస్తాన్ జట్టు 144పరుగులకే పరిమితమైనా.. అనంతరం బెంగళూరును 115 పరుగులకే ఆలౌట్ చేసి రాజస్థాన్ 29 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది.
తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ స్టార్ ఓపెనర్ బట్లర్(8) స్వల్ప స్కోర్‌కే పెవలీయన్కు చేరడంతో కష్టాలు మొదలయ్యాయి. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్(56నాటౌట్) అర్ధసెంచరీతో చెలరేగారు. దేవదత్ పడిక్కల్(7) పూర్తిగా నిరాశ పరిచారు. తర్వాత వచ్చిన అశ్విన్(17), సంజూ శాంసన్(27), డారియల్ మిచెల్(16) స్వల్ప స్కోర్‌కే పెవీలియన్‌కు చేరడంతో రాజస్తాన్ జట్టు 17 ఓవర్లు పూర్తయ్యే సరికి కేవలం 110 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ క్రమంలో రియాన్ పరాగ్ అర్ధశతకంతో మెరిసాడు. షిమ్రాన్ హెట్మెయిర్(3) విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ (5), ప్రసిద్ధ్ కృష్ణ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బెంగళూరు బౌలర్లకు.. చివరి ఓవర్లలో ఫీల్డర్ల నుంచి మద్దతు కరువైంది. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ దినేష్ కార్తీక్ జారవిడిచాడు. ఆ తర్వాతి ఓవర్లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పరాగ్ కొట్టిన బంతి గాల్లోకి ఎత్తుగా లేచింది. అయితే దాన్ని హసరంగ జారవిడిచాడు. ఇలా బతికిపోయిన పరాగ్ ఆ తర్వాత.. 8 బంతుల్లో 21 పరుగులు రాబట్టాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్, హసరంగ, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ దక్కింది.
ఛేదనలో బెంగళూరు జట్టుకు కోహ్లి-డుప్లెసిస్ ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. కోహ్లి(9) ఫామ్‌లేమి ఈ సీజన్లో కొనసాగుతోంది. మ్యాక్స్‌వెల్(0), దినేశ్ కార్తీక్(6) త్వరగా ఔటవ్వడంతో బెంగళూరు జట్టు కోలుకోలేకపోయింది. కెప్టెన్ డుప్లెసిస్(23) మాత్రమే రాణించాడు. కుల్దీప్ సేన్‌కు నాలుగు, అశ్విన్‌కు మూడు, ప్రసిధ్ కృష్ణకు రెండు వికెట్లు లభించాయి.
రాజస్తాన్ రాయల్స్: బట్లర్ (సి)సిరాజ్ (బి)హేజిల్‌వుడ్ 8, పడిక్కల్ (ఎల్బి)సిరాజ్ 7, అశ్విన్ (సి అండ్ బి)సిరాజ్ 17, సంజు (బి)హజరంగ 27, మిఛెల్ (సి)మ్యాక్స్‌వెల్ (బి)హేజిల్‌వుడ్ 16, రియాన్ పరాగ్ (నాటౌట్) 56, హెట్మెయిర్ (సి)ప్రభుదేశారు (బి)హసరంగ 3, బౌల్ట్ (సి)కోహ్లి (బి)హర్షల్ పటేల్ 5, ప్రసిధ్ కృష్ణ (రనౌట్) ప్రభుదేశారు 2, చాహల్ (నాటౌట్) 0, అదనం 3. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 144పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/33, 3/33, 4/68, 5/99, 6/102, 7/110, 8/121
బౌలింగ్: షాబాజ్ అహ్మద్ 3-0-35-0, మహ్మద్ సిరాజ్ 4-0-30-2, హేజిల్‌వుడ్ 4-1-19-2, హసరంగ 4-0-23-2, హర్షల్ పటేల్ 4-0-33-1, మ్యాక్స్‌వెల్ 1-0-4-0
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (సి)రియాన్ (బి)ప్రసిధ్ 9, డుప్లెసిస్ (సి)బట్లర్ (బి)కుల్దీప్ సేన్ 23, రజత్ పటీధర్ (బి)అశ్విన్ 16, మ్యాక్స్‌వెల్ (సి)పడిక్కల్ (బి)కుల్దీప్ సేన్ 0, షాబాజ్ అహ్మద్ (సి)రియాన్ పరాగ్ (బి)అశ్విన్ 17, ప్రభుదేశారు (సి)రియాన్ పరాగ్ (బి)అశ్విన్ 2, దినేశ్ కార్తీక్ (రనౌట్) ప్రసిధ్/చాహల్ 6, హసరంగ (సి అండ్ బి)కుల్దీప్ సేన్ 18, హర్షల్ పటేల్ (సి)రియాన్ పరాగ్ (బి)కుల్దీప్ సేన్ 8, మహ్మద్ సిరాజ్ (సి)కుల్దీప్ సేన్ (బి)ప్రసిధ్ 5, హేజిల్‌వుడ్ (నాటౌట్) 0, అదనం 11. (19.3 ఓవర్లలో ఆలౌట్) 115పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/37, 3/37, 4/58, 5/66, 6/72, 7/92, 8/102, 9/107, 10/115.
బౌలింగ్: బౌల్ట్ 3-0-20-0, ప్రసిధ్ కృష్ణ 4-0-23-2, అశ్విన్ 4-0-17-3, కుల్దీప్ సేన్ 3.3-0-20-4, మిఛెల్ 1-0-7-0, చాహల్ 4-0-23-0