Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి జరిమానాకు గురయ్యాడు. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా స్లో-ఓవర్ రేటుకు గాను లక్నో కెప్టెన్‌గా రూ.24 లక్షలు జరిమానా పడింది. తొలిసారి స్లో ఓవర్ రేటుకుగాను ఇప్పటికే రూ.12 లక్షల జరిమానాను ఎదుర్కొన్న రాహుల్.. తాజాగా ముంబయిపై స్లో-ఓవర్ రేటు నమోదు చేయడంతో రెట్టింపు.. 24 లక్షల జరిమానా వేటు పడింది. రాహుల్‌తో పాటు జట్టు 11మంది సభ్యులకు రూ.6లక్షలతోపాటు మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తున్నట్లు ఐపిఎల్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 'రాహుల్ వరుసగా రెండోసారి స్లో-ఓవర్ రేటును నమోదు చేశాడు.. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం జరిమానాను విధించాం' అని తెలిపారు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 36పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే.