Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 196పరుగులు
ముంబయి: సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మకి తోడు మార్క్రరమ్ అర్ధసెంచరీలతో సహా చివర్లో శశాంక్ సింగ్ విధ్వంస ఇన్నింగ్ ఆడడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. తొలుత 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. అభిషేక్ శర్మ, మార్క్రరమ్ కలిసి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరి భాగస్వామ్యంతో స్కోర్‌బోర్డు పరుగెట్టింది. వారిద్దరి భాగస్వామ్యం చూస్తే హైదరాబాద్ 200లకుపైగా పరుగులు చేసేలా కనిపించింది. జట్టు స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 140 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాక స్కోరు నెమ్మదించింది. పూరన్(3), సుందర్(3) నిరాశపర్చడంతో హైదరాబాద్ జట్టు భారీస్కోర్‌పై ఆశలు వదులుకుంది. ఈ క్రమంలో గుజరాత్ పేసర్ ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్లో సుశాంక్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఆ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టి 25 పరుగులు రాబట్టాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీకి మూడు, యస్ దయాల్, జోసెఫ్‌కు తలా ఒక వికెట్ లభించాయి.
స్కోర్‌బోర్డు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ (బి)జోసెఫ్ 65, విలియమ్సన్ (బి)షమీ 5, త్రిపాఠి (ఎల్బి) షమీ 16, మార్క్రరమ్ (సి)మిల్లర్ (బి) షమీ 56, పూరన్ (సి)శుభ్‌మన్ (బి)షమీ 3, వాషింగ్టన్ సుందర్ (రనౌట్) జోసెఫ్ 3, శశాంక్ సింగ్ (నాటౌట్) 25, జాన్సెన్ (నాటౌట్) 8, అదనం 14. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 195పరుగులు.
వికెట్ల పతనం: 1/26, 2/44, 3/140, 4/147, 5/161, 6/162
బౌలింగ్: షమీ 4-0-39-3, యశ్ దయాల్ 4-0-24-1, జోసెఫ్ 4-0-35-1, రషీద్ ఖాన్ 4-0-45-0, ఫెర్గుసన్ 4-0-52-0.