Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్వేరా కన్నుమూత
బెంగళూరు: భారత మహిళల హాకీజట్టు మాజీ కెప్టెన్, వెటరన్ క్రీడాకారిణి ఎల్వేరా బ్రిట్టో(81) మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. 1960-67మధ్యకాలంలో బ్రిట్టో సారథ్యంలో కర్ణాటక జట్టు ఏడుసార్లు టైటిళ్లను సాధించింది. ఆ కాలంలో మహిళల జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంక, జపాన్లతో పోటీపడినప్పుడు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. 1965లో హాకీ తరఫున అర్జున అవార్డు పొందిన రెండో హాకీ క్రీడాకారిణి బ్రిట్టో మాత్రమే. 1961లో అన్నె లుంస్డెన్కు తొలిసారి అర్జున అవార్డు దక్కింది. బ్రిట్టో మృతికి హాకీ ఇండియా(హెచ్ఐ) అధ్యక్షులు జ్ఞానేంద్ర నింగోబమ్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.