Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ కింగ్స్ లక్ష్యం 154పరుగులు
ఎంసిఏ(పుణె): పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబడా దెబ్బకు లక్నో సూపర్ సెయింట్స్ స్వల్పస్కోర్‌కే పరిమితమైంది. లక్నో ఓపెనర్ డికాక్(46) రాణించినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(6) వైఫల్యంతో ఆ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ దూకుడుగా ఆడాడు. రబడా వేసిన నాలుగో ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అంతకుముందు సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్లో మూడు పరుగులు రాగా.. రిషి ధావన్ వేసిన ఆరో ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే 6 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్నో జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అర్ధ శతకానికి చేరువైన క్వింటన్ డికాక్(46)ను 13వ ఓవర్లో సందీప్ శర్మ వెనక్కి పంపాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తర్వాతి ఓవర్లో దీపక్ హుడా(34) రనౌటయ్యాడు. రబడా వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి కృనాల్ పాండ్య (7) శిఖర్ ధావన్‌కు చిక్కగా.. ఐదో బంతికి ఆయుష్ బదోనీ(4) లివింగ్ స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగల్గింది. చివర్లో ఛమీర(17), మొహిసిన్ ఖాన్(13) రాణించడంతో లక్నో పుంజుకుంది. రబడాకు నాలుగు, రాహుల్ చాహర్‌కు రెండు, సందీప్ శర్మకు ఒక వికెట్ లభించాయి.
లక్నో జట్టుకు షాక్..
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ సిఇవో రఘు అయ్యర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం రఘు అయ్యర్.. జట్టు సభ్యులతో కలిసి హోటల్ నుంచి పుణే స్టేడియానికి బయలుదేరగా.. కొద్దిదూరం వెళ్లగానే రఘు అయ్యర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో రఘు అయ్యర్‌కు తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్విటర్ వేదికగా ఆ ఫ్రాంచైజీ శుక్రవారం ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
స్కోర్‌బోర్డు...
లక్నో సూపర్‌జెయింట్స్: డికాక్ (సి)జితేశ్ శర్మ (బి)సందీప్ శర్మ 46, కేఎల్ రాహుల్ (సి)జితేశ్ శర్మ (బి)రబడా 6, దీపక్ హుడా (రనౌట్) బెయిర్‌స్టో 34, కృనాల్ పాండ్యా (సి)ధావన్ (బి)రబడా 7, స్టోయినీస్ (సి అండ్ బి) రాహుల్ చాహర్ 1, ఆయుశ్ బడోనీ (సి)లివింగ్‌స్టోన్ (బి)రబడా 4, హోల్డర్ (సి)సందీప్ శర్మ (బి)రాహుల్ చాహర్ 11, ఛమీర (సి)రాహుల్ చాహర్ (బి)రబడా 17, మొహిసిన్ ఖాన్ (నాటౌట్) 13, ఆవేశ్ ఖాన్ (నాటౌట్) 2, అదనం 12. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 153పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/98, 3/104, 4/105, 5/109, 6/111, 7/126, 8/144
బౌలింగ్: ఆర్ష్‌దీప్ సింగ్ 4-0-23-0, సందీప్ శర్మ 4-0-18-1, రబడా 4-0-38-4, రిషీ ధావన్ 2-0-13-0, లివింగ్‌స్టోన్ 2-0-23-0, రాహుల్ చాహర్ 4-0-30-2.