Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌరవ్ గంగూలీ
ముంబయి: టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకుంటారని బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ తమ ప్రమాణాలకు తగ్గట్టు ఆడడంలో విఫలమవుతున్నారని, దీంతో ఈ సీజన్ వీరికి పీడకలలా మారిందన్నాడు. పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న వీరికి మాజీల నుంచి సలహాలు, సూచనలు అవసరమన్నాడు. త్వరలోనే వీరి బ్యాట్లనుంచి పరుగుల వరద పారడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. ఫామ్‌లోకి వస్తారని నాకు నమ్మకం ఉంది. త్వరలోనే పరుగులు సాధిస్తారు. విరాట్ కోహ్లీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ త్వరలోనే తిరిగి ఫామ్ అందుకుంటాడనే నమ్మకం ఉంది. సందేహం లేదు.. అద్భుతంగా పరుగులు సాధిస్తాడు. ఐపిఎల్ 2022 సీజన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాను. ఏ జట్టయినా టైటిల్ గెలిచే అవకాశం ఉంది. అందరూ చాలా బాగా ఆడుతున్నారు. కొత్త టీంలు రెండు చాలా బాగా ఆడుతున్నాయి'' అని గంగూలీ అంచనా వేశాడు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించాడు. విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 9మ్యాచుల్లో 128 పరుగులు చేయగా.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో 153 పరుగులే చేశాడు.