Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా సర్వేలో వెల్లడి
లండన్: ఫుట్‌బాల్ క్రీడలోనే జాత్యహంకారం అధికంగా ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. న్యూ ఇప్సోస్ రీసెర్చి డైరెక్టర్ కైరాన్ పెడ్లీ జరిపిన సర్వేలో క్రికెట్, రగ్బీతో పోల్చిచూస్తే.. ఫుట్‌బాల్ క్రీడలో 68% జాత్యహంకార సమస్య ఉన్నట్లు తేలింది. క్రికెట్లో 49%, రగ్బీలో 31% ఈ సమస్య ఉండగా.. జాత్యహంకారం వ్యక్తిగతంగా కంటే ఆన్లైన్ ఫుట్‌బాల్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నట్లు వెల్లడైంది. 2019-20 కాలంలో బహిరంగ స్టేడియాల్లో ద్వేషపూరిత సంఘటనలు గతంతో పోల్చిచూస్తే 146 పెరిగాయని, అది ప్రస్తుతం 206గా ఉందని తేలింది. ఇంగ్లండ్‌లోని ఫుట్‌బాల్ పోలీసింగ్ యూనిట్ తాజా గణాంకాల్లోనూ ఇది స్పష్టమైంది. 2020 యూరో ఫైనల్ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్కస్ రాష్‌ఫోర్డ్, జాడోన్ సాంచో, బుకాయో సాకాపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన వ్యక్తులకు శిక్షలు పడ్డాయని, ఈ క్రమంలో ఆన్లైన్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం పెరిగిందని ఆ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికీ 43%మంది ఫుట్‌బాల్ అభిమానులు జాత్యహంకారానికి గురౌతున్నారని, ఇప్సోసిస్ ఈనెల ప్రారంభంలో 16నుంచి 75ఏళ్ల వయస్సు ఉన్న 2,051మంది వ్యక్తులకు ఇంటర్వ్యూ చేయగా.. అందులో ఫుట్‌బాల్ క్రీడలో జాత్యహంకారం అధికంగా ఉన్నట్లు 921మంది పేర్కొనగా.. 519మంది రగ్బీ క్రీడలో, 447మంది క్రికెట్లో వివక్షకు గురౌతున్నట్లు తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారని పేర్కొంది. క్రికెట్లో జాత్యహంకారం అధికంగా ఉందా? అన్న ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, 49%మంది ఎక్కువగా ఉందని తెలుపగా.. 48శాతం మంది ఇది పెద్ద సమస్య కాదని పేర్కొన్నారని తెలిపింది. గత ఏడాది మాజీ యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ ఎంపీలను దుర్భాషలాడడం బాధాకరమైనప్పటికీ ఇతర ఆటగాళ్లు తమపై ఆరోపణలు చేయడానికి ముందు రావడం హర్షణీయమని వెల్లడించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) క్రీడల్లో వివక్ష పరిష్కరించడానికి గేమ్ వైడ్-12 పాయింట్ ప్లాన్‌ను ప్రారంభించిందని, కానీ ఆ సమస్యను ఇసిబి పూర్తిగా పరిష్కరించలేకపోయిందని, అలా చేస్తే నిధుల్లో కోత పడుతుందని ప్రభుత్వం హెచ్చరించినట్లు సమాచారం. రగ్బీ క్రీడలో మాత్రం ప్రతి ముగ్గురిలో ఒకరు జాత్యహంకారం అధికంగా ఉన్నట్లు తెలిపారని పేర్కొంది.