Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్
మనీల(ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పివి సింధు పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సింధు 21-8, 13-21, 21-19తేడాతో చైనాకు చెందిన హి-బింగ్జియావోను ఓడించింది. ఈ మ్యాచ్‌ను సింధు గంటా 16నిమిషాలసేపు కొనసాగింది. సెమీస్‌కు చేరడం ద్వారా పివి సింధుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. సెమీస్‌లో ఓడిన ఇరువురు షట్లర్లకు ఈ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కనుంది. గిమ్ఛోన్ వేదికగా 2014లో జరిగిన పోటీల్లో సింధు కాంస్య పతకం సాధించింది. సెమీస్‌లో సింధు ఢిఫెండింగ్ ఛాంపియన్, జపాన్‌కు చెందిన యమగుచితో తలపడనుంది. క్వార్టర్స్‌లో యమగుచి 9-21, 21-15, 21-17తో ఛోఛువాంగ్(థారులాండ్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో సాత్త్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ మలేషియాకు చెందిన అరోన్ ఛియో-సో వురుతో అమీతుమీ తేల్చుకోనున్నారు.