Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15 ప్లే-ఆఫ్‌కు గుజరాత్ జట్టు చేరువైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం జరిగిన పోటీలో గుజరాత్జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు 9 మ్యాచుల్లో 16పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 170పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(3) విఫలమైనా.. రాహుల్ తెవాటియా(43నాటౌట్; 25బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) డేవిడ్ మిల్లర్ (39నాటౌట్; 24బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్), వృద్ధిమాన్ సాహా(29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్(20) రాణించారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్, హసరంగకు రెండేసి వికెట్లు దక్కాయి.
కోహ్లి, పటీధర్ అర్ధసెంచరీలు
కోహ్లీ, పటీదర్ అర్ధ సెంచరీలతో రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 11 పరుగుల వద్ద కెప్టెన్ డుప్లెసిస్(0) వికెట్‌ను కోల్పోయినప్పటికీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రజత్ పటీదర్ అర్ధసెంచరీలతో రాణించారు. కోహ్లీ (58పరుగులు; 53బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్), పటీదర్ (52పరుగులు; 32బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు 99 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాక్స్‌వెల్(33పరుగులు; 18బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(2) నిరాశపరిచాడు. మహిపాల్ లోమ్రోర్ 8బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 16పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్కు రెండు, షమీ, జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్‌కు చెరో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (బి)షమీ 58, డుప్లెసిస్ (సి)సాహా (బి)సాంగ్వాన్ 0, పటీదర్ (సి)శుభ్‌మన్ (బి)సాంగ్వాన్ 52, మ్యాక్స్‌వెల్ (సి)రషీద్ ఖాన్ (బి)ఫెర్గుసన్ 33, దినేశ్ కార్తీక్ (సి)షమీ (బి)రషీద్ ఖాన్ 2, షాబాజ్ అహ్మద్ (నాటౌట్) 2, లోమ్రోర్ (సి)మిల్లర్ (బి)జోసెఫ్ 16, అదనం 7. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 170పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/110, 3/129, 4/138, 5/150, 6/170
బౌలింగ్: షమీ 4-0-39-1, సాంగ్వాన్ 4-0-19-2, జెసెఫ్ 4-0-42-1, రషీద్‌ఖాన్ 4-0-29-1, ఫెర్గుసన్ 4-0-36-1.
గుజరాత్ టైటాన్స్: సాహా (సి)పటీదర్ (బి)హసరంగ 29, శుభ్‌మన్ (ఎల్బి) షాబాజ్ 31, సుదర్శన్ (సి) అనుజ్ రావత్ (బి)హసరంగ 20, హార్దిక్ (సి)లామ్రోర్ (బి)షాబాజ్ 3, డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 39, తెవాటియా (నాటౌట్) 43, అదనం 9, (19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 174పరుగులు.
వికెట్ల పతనం: 1/51, 2/68, 3/78, 4/95
బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 1-0-10-0, సిరాజ్ 4-0-35-0, హేజిల్‌వుడ్ 3.3-0-36-0, షాబాజ్ అహ్మద్ 3-0-26-2, హర్షల్ పటేల్ 4-0-35-0, హసరంగ 4-0-28-2