Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంనుంచి కోలుకొన్న మాజీ టాప్‌సీడ్
మాడ్రిడ్: మహిళల బ్యాడ్మింటన్ మాజీ టాప్ సీడ్, స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మోకాలి గాయం నుంచి కోలుకొని మారిన్.. ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ క్రిస్టీ గిల్మోర్‌పై 21-10, 21-12పాయింట్ల తేడాతో వరుససెట్లలో విజయం సాధించింది. 2016 ఒలింపిక్ ఛాంపియన్ మారిన్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో గాయం కారణంగా మధ్యలో అర్ధాంతరంగా వైదొలిగింది. రెండు మోకాళ్లకు(అంకెల్) శస్త్రచికిత్స చేయించుకున్న మారిన్.. తిరిగి బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే విజేతగా నిలిచింది. టైటిల్ విజేతగా నిలిచిన మారిన్‌కు ఇది ఆరో యూరోపియన్ టైటిల్. క్వార్టర్ఫైనల్లో మాత్రమే కరోలినా మారిన్ విజయంకోసం మూడుసెట్లకు వెళ్లింది. 2016 ఒలింపిక్స్‌లో మారిన్ స్వర్ణ పతకం సాధించగా... పివి సింధు ఫైనల్లో ఓడి రజత పతకానికే పరిమితమైన సంగతి తెలిసిందే.