Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి లక్ష్యం 159పరుగులు
డివై పాటిల్(ముంబయి): రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ మరోసారి మెరిసాడు. ఈ సీజన్ ఐపిఎల్‌లో దుర్భేధ్యఫామ్‌లో ఉన్న బట్లర్ శనివారం ముంబయి ఇండియన్స్‌పై 67పరుగులు చేసి రాజస్తాన్ జట్టు గౌరవప్రద స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత రాజస్తాన్ 180పరుగులు చేస్తుందని అనిపించినా.. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ జట్టును 158 పరుగులకే పరిమితమైంది. బట్లర్ ఔటయ్యాక ముంబయి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆఖరి ఓవర్ వేసిన మెరిడిత్ మరింత కట్టుదిట్టంగా బౌల్ చేశాడు. అయితే పదహారో ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన అతను.. అదే ఓవర్ ఆరో బంతికి సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాటర్లలో అశ్విన్ 21పరుగులు, మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దేవదత్ పడిక్కల్(15), సంజూ శాంసన్(16), డారియల్ మిచెల్(17) పరుగులు మాత్రమే చేశారు. రియాన్ పరాగ్(3) నిరాశ పరచగా.. షిమ్రాన్ హెట్మెయిర్ (14 బంతుల్లో 6నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెరెడిత్, హృతిక్ షోకీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అరంగేట్రం ఆటగాడు కుమార్ కార్తికేయ, డానియల్ శామ్స్ కూడా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
రాజస్తాన్ రాయల్స్: జాస్ బట్లర్ (సి)సూర్యకుమార్ (బి)షోకెన్ 67, పడిక్కల్ (సి)పొలార్డ్ (బి)షోకెన్ 15, సంజు (సి)టిమ్ డేవిడ్ (బి)కార్తికేయ 16, మిఛెల్ (సి)రోహిత్ (బి)సామ్స్ 17, హెట్మెయిర్ (నాటౌట్) 6, రియాన్ పరాగ్ (సి)సామ్స్ (బి)మెరిడిత్ 3, అశ్విన్ (సి)ఇషాన్ కిషన్ (బి)మెరిడిత్ 21, బౌల్ట్ (నాటౌట్) 1, అదనం 12. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 158పరుగులు.
వికెట్ల పతనం: 1/26, 2/54, 3/91, 4/126, 5/130, 6/155
బౌలింగ్: సామ్స్ 4-0-32-1, బుమ్రా 4-0-27-0, షోకెన్ 3-0-47-2, మెరిడిత్ 4-0-24-2, కార్తికేయ 4-0-19-1, పొలార్డ్ 1-0-8-0