Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో యమగుచి చేతిలో ఓటమి
మనీల(ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ మహిళల సింగిల్స్‌లో పివి సింధు కాంస్య పతకానికే పరిమితమైంది. అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు.. సెమీస్‌లో మూడుసెట్ల హోరాహోరీ పోరులో యమగుచి చేతిలో ఓటమిపాలైంది. సెమీఫైనల్లో డిఫెడింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ అకానె యమగూచి(జపాన్) చేతిలో 21-13, 19-21, 16-21తేడాతో ఓటమిపాలైంది. తొలి సెట్‌ను నెగ్గిన సింధు.. రెండో సెట్లోనూ ఓ దశలో ఆధిక్యతలోకి దూసుకెళ్లి ఆశలు రేపింది. కానీ చివర్లో ఆ సెట్‌ను చేజార్చుకొంది. కాగా, ఈ ఆసియా ఛాంపియన్షిప్ టోర్నీల్లో సింధుకు ఇది రెండో పతకం కావడం విశేషం. 2014లో జిమ్‌చన్(దక్షిణ కొరియా) షట్లర్‌పై తొలిసారి కాంస్య పతకం కైవసం చేసుకుంది. సైనా నెహ్వాల్ (2010 ఢిల్లీ, 2016 వుహాన్, 2018 వుహాన్) సైతం గతంలో ఈ పోటీల్లో మూడుసార్లు కాంస్యంతోనే సరిపెట్టుకుంది.