Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన జడేజా
ముంబయి: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా నాయకత్వ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. ఆటపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడేజా తెలిపాడు. దీంతో జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం. 15వ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ జట్టు పగ్గాలను వదిలేయడంతో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లో చెన్నై కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. మరోవైపు ఆల్‌రౌండర్ పాత్రను పోషించడంలో జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీకే సారథ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. నాలుగుసార్లు చెన్నైకి టీ20 లీగ్ టైటిల్‌ను అందించిన ధోనీ సీజన్ పోటీల ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకొని జడేజాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది.