Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఊహించినదే చేసింది. టెస్టు కెప్టెన్‌గా జో రూట్ స్థానంలో బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్సీ నుంచి ప్రమోషన్ పొందాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. టెస్టు ఫార్మాట్లో 17 మ్యాచుల్లో గెలుపు రుచి చూడని ఇంగ్లాండ్ జట్టును నడిపించటం కొత్త కెప్టెన్‌కు కఠిన సవాల్‌గా మారనుంది.
' పని ఒత్తిడి, పని భారం మీడియా సృష్టి. వైట్‌బాల్, ఐపీఎల్ అవకాశాలను సమన్వయం చేసుకుంటూనే టెస్టు క్రికెట్‌కు నా తొలి ప్రాధాన్యత ఇస్తాను. ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహించటం ఆసక్తిగా ఉంది. నా వరకు కెప్టెన్సీ ఓ సవాల్. గత కొంతకాలంగా ఇంగ్లాండ్ ప్రదర్శన దృష్ట్యా ఇది మరింత సవాల్‌గా స్వీకరిస్తాను. స్వార్థం లేని ఆటగాళ్లతో ఇంగ్లాండ్‌ను టెస్టుల్లో ముందుకు నడిపిస్తాను. సరైన కూర్పును ఎంచుకోవటమే టెస్టు మ్యాచ్‌లో విజయానికి ఉత్తమ మార్గం' అని బెన్ స్టోక్స్ తెలిపాడు. టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ తొలి సవాల్‌ను మాతృ దేశం న్యూజిలాండ్ నుంచి ఎదుర్కొనున్నాడు. జూన్ 2న లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టుతో బెన్ స్టోక్స్ నాయకత్వ ప్రయాణం ఆరంభం కానుంది.