Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్
దుబాయ్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా నిరాశపరిచిన టీమ్ ఇండియా వార్షిక ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. 2021-22 క్రికెట్ సీజన్ వార్షిక ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం విడుదల చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో తేలిపోయినా.. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సత్తా చాటిన భారత్ వరల్డ్ నం.1గా నిలిచింది. 270 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగగా.. ఇంగ్లాండ్ (265), పాకిస్థాన్ (261), దక్షిణాఫ్రికా (253), ఆస్ట్రేలియా (251) టాప్-5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐదు రోజుల ఆటలో ఆస్ట్రేలియా టాప్ పొజిషన్ సొంతం చేసుకుంది. 128 రేటింగ్ పాయింట్లతో భారత్ కంటే ముందంజలో నిలిచింది. 119 రేటింగ్ పాయింట్లతో టీమ్ ఇండియా ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (111), దక్షిణాఫ్రికా (110), పాకిస్థాన్ (93)లు టాప్-5లో చోటు చేసుకున్నాయి. 2018లో భారత్‌పై 4-1 టెస్టు సిరీస్ విజయంతో గణనీయంగా పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్.. ఆ సిరీస్ ఫలితం ఈ వార్షిక ర్యాంకింగ్స్ నుంచి తొలగించటంతో అమాంతం కిందకు పడిపోయింది. గత 17 టెస్టుల్లో గెలుపు రుచి ఎరుగని ఇంగ్లాండ్ 1995 తర్వాత తొలిసారి 88 రేటింగ్ పాయింట్లకు చేరుకుంది. ఇక వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 125 రేటింగ్ పాయింట్లతో కివీస్ నం.1 స్థానం నిలుపుకుంది. ఇంగ్లాండ్ (124), ఆస్ట్రేలియా (107), భారత్ (105), పాకిస్థాన్ (102) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.