Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్
న్యూఢిల్లీ : బ్యాటింగ్ లైనప్‌లో మిడిల్ ఆర్డర్ సందిగ్థత, క్రమం తప్పకుండా మార్పులు చేర్పులు ఐసీసీ ఈవెంట్లలో టీమ్ ఇండియా అవకాశాలకు గండి కొడుతున్నాయని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. సంజరు మంజ్రేకర్‌తో ఓ టాక్ షోలో మాట్లాడుతూ యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. '2011లో మేము ప్రపంచకప్ విజయం సాధించినప్పుడు జట్టులో అందరికీ బ్యాటింగ్ పొజిషన్‌పై స్పష్టత ఉంది. ప్రతి ఒక్కరు ఓ స్థానంలో బ్యాటింగ్‌కు సెటిల్ అయ్యారు. 2019 ప్రపంచకప్‌కు భారత్ సరైన రీతిలో సన్నద్ధం కాలేదు. నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు విజరు శంకర్‌ను తీసుకున్నారు. అతడికి 5-7 వన్డేల అనుభవమే ఉంది. ఆ తర్వాత అదే స్థానంలో 4 వన్డేలు ఆడిన రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని నం.4 బ్యాటర్‌ను ఎంపిక చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 2003 ప్రపంచకప్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మహ్మద్ కైఫ్, దినేశ్ మోంగియా, నాకు అప్పటికే 50 వన్డేలు ఆడిన అనుభవం సొంతం. మిడిల్ ఆర్డర్ సమస్య, సరైన ప్రణాళిక లేకపోవటంతోనే ఐసీసీ ఈవెంట్లలో భారత్ బోల్తా పడుతోందని' యువరాజ్ సింగ్ అన్నాడు.