Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన డెవిడ్, ఇషాన్ కిషన్
- ముంబయి ఇండియన్స్ 177/6
నవతెలంగాణ-ముంబయి
ముంబయి ఇండియన్స్ యువ బ్యాటర్ టిమ్ డెవిడ్ (44 నాటౌట్, 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. ధనాధన్ షాట్లతో దుమ్మురేపిన టిమ్ డెవిడ్ డెత్ ఓవర్లలో ముంబయికి దండిగా పరుగులు రాబట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (43, 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ ఇషాన్ కిషన్ (45, 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ప్రమాదకర బ్యాటర్ కీరన్ పొలార్డ్ (4, 14 బంతుల్లో) చెత్త బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ (2/23) ముంబయి ఇండియన్స్‌ను కట్టడి చేయటంలో టైటాన్స్ బౌలర్లకు నాయకత్వం వహించాడు.
ఆ ముగ్గురు మెరిసినా..! : టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ప్రయోగం చేసిన హార్దిక్పాండ్యసేన ఈసారి ముంబయిపై ఆ పొరపాటు చేయలేదు. అయితే, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్ ఆరంభంలో ఒత్తిడి లేకుండా ఆడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (45, 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (43, 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలోనే రషీద్ ఖాన్‌పై దండయాత్ర చేసిన ముంబయి పరుగుల వేటలో దూసుకెళ్లింది. ఓపెనర్ల మెరుపులతో 10 రన్‌రేట్‌తో ముంబయి స్కోరు వేగంగా ముందుకు సాగింది. పవర్ ప్లేలో దెబ్బతిన్న రషీద్ ఖాన్ గొప్పగా పుంజుకుని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మను ఎల్బీగా అవుట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశపరచగా.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (21, 16 బంతుల్లో 2 ఫోర్లు) కుదురుకున్న అనంతరం రనౌట్‌గా నిష్క్రమించాడు. తొలి పది ఓవర్లలో గొప్పగా ఆడిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. దీంతో 200 పరుగుల దిశగా సాగిన ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది.
తిలక్ శర్మ, టిమ్ డెవిడ్ (44 నాటౌట్, 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జోడీ ముంబయి స్కోరును ముందుకు నడిపించారు. తిలక్ వర్మ నిష్క్రమించినా టిమ్ డెవిడ్ బౌండరీలతో ధనాధన్ జోరు చూపించాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో అలరించాడు. విధ్వంసక హిట్టర్ కీరన్ పొలార్డ్ (4, 14 బంతుల్లో) మరోసారి ముంబయిని వెనక్కి లాగాడు. 14 బంతుల్లో ఒక్క బౌండరీ బాదని పొలార్డ్ కేవలం నాలుగు పరుగులు చేశాడు. పొలార్డ్ కనీసం 10-15 పరుగులు ముంబయిని వెనక్కి లాగాడు. చివర్లో డెవిడ్ మెరుపులతో ముంబయి ఇండియన్స్ 177 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (2/24), లాకీ ఫెర్గుసన్ (1/34), ప్రదీప్ సంగ్వాన్ (1/23) రాణించారు.
స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : ఇషాన్ కిషన్ (సి) రషీద్ ఖాన్ (బి) జొసెఫ్ 45, రోహిత్ శర్మ (ఎల్బీ) రషీద్ ఖాన్ 43, సూర్యకుమార్ యాదవ్ (సి) రషీద్ ఖాన్ (బి) సంగ్వాన్ 13, తిలక్ వర్మ (రనౌట్) 21, కీరన్ పొలార్డ్ (బి) రషీద్ ఖాన్ 4, టిమ్ డెవిడ్ నాటౌట్ 44, డానియల్ శామ్స్ (సి) రషీద్ ఖాన్ (బి) ఫెర్గుసన్ 0, మురుగన్ అశ్విన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం :(20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం : 1-74, 2-99, 3-111, 4-119, 5-157, 6-164.
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-42-0, అల్జారీ జొసెఫ్ 4-0-21-1 , రషీద్ ఖాన్ 4-0-24-2, లాకీ ఫెర్గుసన్ 4-0-34-1, ప్రదీప్ సంగ్వాన్ 3-0-23-1, రాహుల్ తెవాటియ 1-0-11-0.