Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థామస్, ఉబెర్ కప్ నేటి నుంచే
బ్యాంకాక్ : ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్‌లో టీమ్ ఇండియా పతక వేట మళ్లీ షురూ కానుంది. సైనా నెహ్వాల్, పి.వి సింధు భీకర ఫామ్‌లో ఉన్న దశలో 2014, 2016లో భారత మహిళల జట్టు ఉబెర్ కప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది. కానీ పురుషల జట్టు థామస్ కప్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెమీఫైనల్స్‌కు చేరుకోలేదు. గత టోర్నీలో పురుషుల, మహిళల జట్లు క్వార్టర్‌ఫైనల్స్ నుంచే నిష్క్రమించాయి. మహిళల జట్టులో పి.వి సింధుపై ఆశలు ఉన్నాయి. డబుల్స్ జంట సిక్కిరెడ్డి, పొన్నప్ప సహా గాయత్రి గోపీచంద్ గాయాలతో దూరమయ్యారు. యువ షట్లర్లతో కలిసి సింధు ఒంటరి పోరాటం చేయనుంది. ఈ విభాగంలో భారత పతక అవకాశాలు చాలా తక్కువ. అయితే, పురుషుల విభాగంలో ఈ సారి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వరల్డ్ నం.9 లక్ష్యసేన్, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరులు సింగిల్స్ విభాగంలో తలపడనున్నారు. డబుల్స్ విభాగంలో వరల్డ్ నం.9 జంట సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలతో పాటు ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిలలు కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్‌లు సైతం ఉన్నారు. దీంతో ఈ సారి థామస్ కప్‌లో భారత్ మెడల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. థామస్, ఉబెర్ కప్‌లు నేడు బ్యాంకాక్ వేదికగా ఆరంభం కానున్నాయి.