Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5-0తో కెనడాపై అదిరే విజయం
- థామస్ కప్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్ (థాయ్‌లాండ్) : ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. భారత పురుషుల జట్టు థామస్ కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన టీమ్ ఇండియా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది!. గ్రూప్-సిలో సోమవారం కెనడాపై భారత్ 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. తొలి రౌండ్లో జర్మనీని 5-0తో చిత్తు చేసిన టీమ్ ఇండియా.. కెనడాకూ అదే ఫలితం రుచి చూపించింది. గ్రూప్ దశలో చైనీస్ తైపీతో భారత్ తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ క్వార్టర్ఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది. సింగిల్స్, డబుల్స్ మ్యాచుల్లో భారత షట్లర్లు అంచనాలను అందుకున్నారు.
తొలి సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 20-22, 21-11, 21-15తో బ్రియాన్ యాంగ్‌పై 52 నిమిషాల పాటు మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందాడు. తొలి డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 21-12, 21-11తో 29 నిమిషాల్లోనే చెమటపట్టకుండా గెలుపొందింది. రెండో సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు 21-15, 21-12తో సులువుగా గెలుపొందాడు. రెండో డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జోడీ 21-15, 21-11తో వరుస గేముల్లో విజయం సాధించారు. మూడో సింగిల్స్‌లో ప్రియాన్షు రాజవత్ 21-13, 20-22, 21-14తో విక్టర్ లీ పై ఆకట్టుకునే విజయం సాధించాడు. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచుల్లో విజయ ఢంకా మోగించిన భారత్ క్వార్టర్ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. నేడు ఉబెర్ కప్‌లో భారత అమ్మాయిలు అమెరికాతో పోటీపడనున్నారు.