Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ టైటాన్స్ 62పరుగుల తేడాతో గెలుపు
ఎంసిఏ(పూణె): రషీద్, సాయికిషోర్ రాణించడంతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు 13.4 ఓవర్లలో కేవలం 82పరుగులకే చతికిల పడి ఈ సీజన్ ఐపిఎల్‌లో తక్కువ పరుగులకే ఆలౌటైన జట్టుగా నిలిచింది. రషీద్ ఖాన్(4/24), సాయికిషోర్ 2/7) గుజరాత్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ సాహా(5) విఫలం కాగా.. వేడ్(10) కూడా నిరాశపరిచాడు.