Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ టెస్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్
- అధికారికంగా ప్రకటించిన ఇంగ్లాండ్ బోర్డు
లండన్ : ఐపీఎల్ ప్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్ నుంచి మరో కోచ్ ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు వెళ్తున్నాడు!. గతంలో ట్రెవర్ బెయిలిస్ గతంలో నైట్‌రైడర్స్ కోచ్‌గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కోచ్‌గా వెళ్లాడు. ట్రెవర్ బెయిలిస్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ చారిత్రక వన్డే వరల్డ్‌కప్ 2019ను గెల్చుకుంది. తాజాగా కోల్‌కత నైట్‌రైడర్స్ చీఫ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఈసీబీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఈసీబీ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ వెల్లడించారు. గత 17 టెస్టుల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన ఇంగ్లాండ్.. 1995 తర్వాత తొలిసారి ర్యాంకింగ్స్‌లో పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు లేదు. కానీ, న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్‌గా అతడు రెడ్ బాల్ ఫార్మాట్లో కివీలను నడిపించిన విధానం విమర్శల మన్నన్నలు పొందింది. న్యూజిలాండ్ టెస్టు విజయాల ప్రభావం వైట్‌బాల్ ప్రదర్శనపైనా పడింది. ఫలితంగా 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ టైటిల్ కోసం పోరాడింది. ఈ ఏడాది జూన్ నుంచి నాలుగేండ్ల పాటు ఇంగ్లాండ్ టెస్టు జట్టు చీఫ్ కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ కొనసాగనున్నాడు' ఇంగ్లాండ్ టెస్టు జట్టు చీఫ్ కోచ్‌గా పనిచేయటం గొప్ప గౌరవం. ఇంగ్లాండ్ క్రికెట్‌ను ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తాను. డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో మార్పు తీసుకురావటంలో మంచి అనుభవం ఉంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి ఇంగ్లాండ్ టెస్టు జట్టును విజయవంతమైన యుగంలోకి నడిపిస్తాను. కొత్త బాధ్యతల పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని బ్రెండన్ మెక్కల్లమ్ తెలిపాడు.