Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ కోచ్ డేవ్ వాట్మోర్ హైదరాబాద్‌లో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కు సారథ్యం వహిస్తున్నాడు!. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఎం.ఎస్ ధోని క్రికెట్ అకాడమీ సమ్మర్ క్యాంప్‌లో డేవ్ వాట్మోర్ ప్రత్యేక శిక్షణ తరగతులను తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎం.ఎస్ ధోని క్రికెట్ అకాడమీ, డేవ్ వాట్మోర్ శుక్రవారం ఇక్కడి జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమ్మర్ క్యాంప్‌లో భాగంగా వర్థమాన క్రికెటర్లకు మెరుగైన ఆట నైపుణ్యాలు, బౌలింగ్ వైవిధ్యాలు, గోల్ సెట్టింగ్ సహా న్యూట్రిషన్‌పై వాట్మోర్ ప్రత్యేక సెషన్లు తీసుకోనున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సెషన్లలో డేవ్ వాట్మోర్ స్వయంగా నెట్స్‌లో క్రికెటర్లకు తర్ఫీదు ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన పిల్లలకు ఉచిత శిక్షణ, భోజన వసతితో హాస్టల్ సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు డీపీఎస్ సీఓఓ యసస్వి మల్కా తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌డీసీఏ మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, హెడ్ కోచ్ వి. వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.