Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కే జోక్యంతో ట్వీట్ తొలగింపు
ముంబయి : తెలుగు తేజం, భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు వీడ్కోలుపై డైలామాలో పడ్డాడు!. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా 13వ సీజన్లో ఆడుతున్న అంబటి రాయుడు ప్రస్తుతం నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో ఈ సీజనే ఆఖరు అని తొలుత అంబటి రాయుడు ట్వీట్ చేసి రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. కానీ 30 నిమిషాల్లోనే ఆ ట్వీట్‌ను తొలగించాడు. 'ఈ సీజనే నాకు చివరి ఐపీఎల్ అని ప్రకటించడానికి సంతోషంగా ఉన్నాను. గత 13 ఏండ్లుగా రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిథ్యం వహించాను. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని రాయుడు ట్వీట్ చేశాడు. ఇర్షాన్ పఠాన్, డుపెస్లిస్లు రాయుడు ట్వీట్‌కు స్పందించారు. అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటనతో చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యంతో అతడితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో రాయుడు రిటైర్మెంట్ ట్వీట్‌ను 30 నిమిషాల్లోనే తొలగించాడు. రిటైర్మెంట్పై యూ టర్న్ తీసుకున్న రాయుడు వచ్చే రెండు సీజన్ల పాటు చెన్నైకి ప్రాతినిథ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక కాకపోవటంతో మనస్థాపం చెందిన అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్లోనే మాత్రమే కొనసాగుతున్నాడు.