Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఆసీస్ క్రికెటర్
మెల్బోర్న్ : ఈ ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. షేన్ వార్న్, రోడ్నీ మార్ష్ మార్చి ఆరంభంలో తుది శ్వాస విడువగా.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ అండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ' హెర్వీ రేంజ్లో సింగిల్ వెహికిల్ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, హెర్వీ రేంజ్ రోడ్లో రాత్రి 11 గంటల సమయంలో రోడ్వే నుంచి కిందకు వెళ్లిపోయింది. అత్యవసర సేవల విభాగం వారు 46 ఏండ్ల డ్రైవర్ను కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. పలు గాయాలతో డ్రైవర్ మృతి చెందాడు' అని క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించారు.
46 ఏండ్ల అండ్రూ సైమండ్స్ రిటైర్మెంట్ అనంతరం టౌన్స్విల్లెలో నివాసం ఉంటున్నారు. ఆస్ట్రేలియాకు 26 టెస్టులు, 198 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన సైమండ్స్ 2009లో అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. అండ్రూ సైమండ్స్ పట్ల మృతి పట్ల క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.