Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా హ్యాండ్బాల్ లీగ్ డ్రా విడుదల
హైదరాబాద్: ఆసియా హ్యాండ్బాల్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్లో భారత్కు సులువైన డ్రా ఎదురైంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూన్ 21 నుంచి జరుగనున్న మెగా ఈవెంట్కు ఆదివారం ఇక్కడ డ్రా విడుదల చేశారు. గ్రూప్-ఎలో భారత్ (టీస్పోర్ట్స్ క్లబ్), సౌదీ అరేబియా (ఆల్ నూర్ క్లబ్), ఖతార్ (అల్ అరబీ క్లబ్), కువైట్ (అల్ ఖుదిసియా క్లబ్)లు ఉండగా, గ్రూప్-బిలో కువైట్ (అల్ కువైట్ క్లబ్), సౌదీ అరేబియా (అల్ సఫా), ఇరాన్ (మిస్ కిర్మాన్ క్లబ్), బెహ్రెయిన్ (అల్ నజ్మ క్లబ్), ఖతార్ (అల్ వక్రా క్లబ్) చోటు చేసుకున్నాయి. కార్యక్రమంలో భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ కోశాధికారి బాదర్ అల్ తేయాబ్ సహా తదితరులు పాల్గొన్నారు.