Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు రెజ్లర్లతో భారత జట్టు ప్రకటన
లక్నో: కామన్వెల్త్ క్రీడలకు సాక్షి మాలిక్ (62 కిలోలు), వినేశ్ ఫొగట్ (53 కి)తో సహా ఆరు మందితో కూడిన బారత జట్టును ఎంపిక చేశారు. లక్నో వేదికగా సోమవారం నిర్వహించిన జాతీయ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. జులై 28 నుంచి బర్మింగ్హమ్లో జరుగనున్న మెగా ఈవెంట్లో భారత రెజ్లర్లు పూజా గెహ్లాట్ (50 కిలోలు), వినేశ్ ఫొగట్ (53 కిలోలు), అన్షు (57 కిలోలు), దివ్య కక్రాన్ (68 కిలోలు), పూజా సిహగ్ (76 కిలోలు) ఆయా విభాగాల్లో బరిలోకి దిగనున్నారు. పురుషుల ట్రయల్స్ మంగళవారం జరుగనున్నాయి.