Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పితృత్వ సెలవుపై స్వదేశం వెళ్లిన వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చేశాడు. తన భార్య తొలి బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబంతో గడిపేందుకు హెట్మెయర్ స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లకు హెట్మయర్ దూరంగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకోవడంతో తదుపరి మ్యాచ్‌ల కోసం హెట్మెయిర్ భారత్‌కు చేరుకున్నాడు. 'హెట్మెయర్ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు' అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 8 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 25 ఏండ్ల హెట్మెయర్ తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడి 291 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.