Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోకియా, స్టబ్స్లకు పిలుపు
జొహనెస్‌బర్గ్ : భారత్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) పూర్తి స్థాయి జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో టెస్టులను కాదనుకుని ఐపీఎల్లో ఆడుతున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లను సైతం టీ20 సిరీస్‌కు జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా దేశవాళీ టీ20 సీజన్లో పరుగుల వరద పారించిన త్రిస్టాన్ స్టబ్స్‌కు సెలక్టర్లు తొలిసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో ఆడుతున్న స్పీడ్‌స్టర్ ఎన్రిచ్ నోకియా సైతం టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. తెంబ బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్‌లో జూన్ 9 నుంచి ఆరంభం కానుంది. ఢిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్‌కోట్, బెంగళూర్లు టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు : తెంబ బవుమా, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎడెన్ మార్కరం, డెవిడ్ మిల్లర్, లుంగిసాని ఎంగిడి, ఎన్రిచ్ నోకియా, వేనీ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, షంషి, త్రిస్టన్ స్టబ్స్, రసెన్ వాడన్ డుసెన్, మార్కో జాన్సెన్.