Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మీర్జాగూడలోని నాసర్ పోలో స్టేడియంలో జరిగిన ఇన్విటేషన్ కప్ పోలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ నెల 8 నుంచి జరిగిన పోలో పోటీల్లో ఆతిథ్య భారత్ సహా ఫ్రాన్స్, అర్జెంటీనా, జపాన్, దక్షిణ కొరియాలు పాల్గొన్నాయి. మెరుపు వేగంతో కదులుతూ, గుర్రంపై నుంచే బంతిని గోల్ చేయటం ప్రేక్షకులను కట్టిపడేసింది. భారత్ సహా ఇతర దేశాల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచులను వీక్షకులను కనువిందు చేశాయి. పురుషులతో పాటు మహిళలు సైతం పోటీపడిన ఈ టోర్నీ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడగా.. ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. భారత జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి పోటీలు మరిన్ని నిర్వహిస్తామని నాసర్ పోలో నిర్వాహకులు మీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.