Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాదీపై గవాస్కర్ ప్రశంసలు
ముంబయి : హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మ భారత్‌కు మూడు ఫార్మాట్ల బ్యాటర్‌గా రూపు దిద్దుకుంటాడని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తిలక్ వర్మపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను గవాస్కర్ సమర్థించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచుల్లో 368 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ముంబయి ఇండియన్స్‌కు చేదు సీజన్లో తీపి గుళికగా కనిపిస్తున్నాడు. 'తిలక్ వర్మ టెంపర్మెంట్ బాగుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిలో క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో ఒకటి, రెండు పరుగులతో స్ట్రయిక్‌రొటేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. భారీ షాట్లు ఆడుతూనే స్ట్రయిక్ రొటేట్ చేశాడు. తిలక్తి మంచి క్రికెటింగ్ బుర్ర అని ఇది తెలుపుతుంది. ఓ బ్యాటర్‌కు అది అత్యంత ప్రధానం. ఆ లక్షణం ఉన్న బ్యాటర్.. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. పరిస్థితులను తనవైపు తిప్పుకోగలడు. ఆటను సమీక్షించుకుని, పరుగులు రాబట్టే మార్గం అన్వేషించగలడు. రోహిత్ శర్మ సరైన వ్యాఖ్యలు చేశాడు. తిలక్ వర్మ నిజంగానే భారత్‌కు భవిష్యత్‌లో మూడు ఫార్మాట్ల బ్యాటర్. టెక్నిక్, ఫిట్నెస్, ఇతర అంశాల్లో ఇంకొంత కష్టపడి రోహిత్ వ్యాఖ్యలు నిజం చేయాల్సిన బాధ్యత తిలక్ వర్మపై ఉంది' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.