Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1988 ఘటనపై సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 1998లో రోడ్డు జరిగిన ఓ ఘటనలో ఆవేశంతో సిద్దూ ఓ వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. 65 ఏండ్ల గుర్నాం సింగ్ మరణించిన కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం నవజోత్ సింగ్ సిద్దూకు రూ.1000 జరిమానా విధిస్తూ 2018లో తీర్పు వెలువరించింది. తాజాగా తామిచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషనును విచారించిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్లు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించారు. డిసెంబర్ 27, 1998లో పంజాబ్‌లోని పాటియాలలో చోటుచేసుకున్న ఘటనలో సిద్దూ నిగ్రహం కోల్పోయాడు. పట్టరాని కోపంతో ఊగిపోతూ గుర్నాం సింగ్‌ను కారులో నుంచి బయటకు లాగి మరీ పిడిగుద్దుల పంచ్‌లు సంధించాడు. గతంలో గుర్నాం సింగ్ మరణానికి గల కారణాలు స్పష్టంగా లేవని, సిద్దూ దాడితో అయిన గాయాలే మరణానికి దారితీశాయని వైద్య నివేదికలో లేదని కేవలం జరిమానాతో సరిపెట్టారు. తాజాగా తీర్పును సవరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడాది జైలు శిక్ష విధించింది. సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష తీర్పుపై అప్పీలు వెళ్తానని నవజోత్ సింగ్ సిద్దూ తెలిపారు.