Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లీష్ సమ్మర్ సీజన్‌కు దూరం
లండన్ : ఇంగ్లాండ్ భీకర పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత 14 మాసాల్లో మూడుసార్లు శస్త్ర చికిత్సకు చేయించుకున్న కరీబియన్ స్పీడ్‌గన్ ఓ గాయం నుంచి కోలుకుంటూనే మరో గాయం బారిన పడ్డాడు. మోచేతి శస్త్రచికిత్స అనంతరం రిహాబిలిటేషన్‌లో ఉంటున్న జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్లో ససెక్స్ కౌంటీ తరఫున టీ20 బ్లాస్ట్‌లో పునరాగమనం చేయాల్సి ఉంది. రానున్న గురువారం ఓ వార్మప్ మ్యాచ్‌కు సైతం ఆర్చర్ సన్నద్ధం అయ్యాడు. గాయం నుంచి కోలుకుని మైదానంలో అడుగుపెట్టకముందే.. ఆర్చర్ మరో గాయంతో ఇంగ్లీష్ వేసవికి దూరమయ్యాడు. ఈ మేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సిన జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగానే సీజన్‌కు దూరమయ్యాడు. తాజా గాయంతో ఆర్చర్ మరో 2-3 మాసాలు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు.