Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ వాకోవర్
- థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్ : చారిత్రక థామస్ కప్ విజయ సారథి, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌కు ముందే వాకోవర్ ఇచ్చి వైదొలిగాడు. థామస్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించగా.. శ్రీకాంత్ గ్రూప్ దశ నుంచి తుది పోరు వరకూ అన్ని మ్యాచుల్లో విజయాలు నమోదు చేశాడు. ఎనలేని ఒత్తిడితో కూడిన మ్యాచులు ఆడిన శ్రీకాంత్ శారీరకంగా బాగా అలసిపోయాడు!. పని ఒత్తిడి, పని భారం కారణాలతోనే శ్రీకాంత్ రెండో రౌండ్లో వాకోవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ వాకోవర్ మెన్స్ సింగిల్స్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. మహిళల సింగిల్స్‌లో అగ్ర షట్లర్ పి.వి సింధు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్‌లో దక్షిణ కొరియా షట్లర్ సిమ్ యు జిన్‌పై సింధు వరుస గేముల్లోనే గెలుపొందింది. 21-16, 21-13తో 37 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. తొలి రౌండ్లో చెమటోడ్చిన సింధు ప్రీ క్వార్టర్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ 21-16, 14-21, 14-21తో మూడు గేముల్లో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో అశ్విని, శిఖా జోడీ 19-21, 6-21తో జపాన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది.