Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో యయగూచిపై గెలుపు
- థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్ : రెండు సార్లు ఒలింపిక పతక విజేత, భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు థారులాండ్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వరల్డ్ నం.1 అకానె యమగూచి (జపాన్)పై పి.వి సింధు 2-1తో మెరుపు విజయం నమోదు చేసింది. మూడు గేముల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్ఫైనల్లో 21-15, 20-22, 21-13తో యమగూచిపై సింధు గెలుపొందింది. థారులాండ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆరోసీడ్ భారత షట్లర్ 51 నిమిషాల్లోనే సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. నేడు ఫైనల్లో చోటు కోసం చైనా స్టార్ షట్లర్ చెన్ యుఫెరుతో తలపడనుంది. ఒలింపిక్ పసిడి విజేత చెన్ యుఫెరుతో ముఖాముఖి రికార్డులో సింధుకు 6-4తో మెరుగైన రికార్డు ఉంది. చివరగా చెన్ యుఫెరు, సింధు తలపడిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్ పెనాల్టీ పాయింట్‌తో వివాదాస్పదమైంది. తొలి గేమ్‌లో యమగూచి దూకుడుగా ఆడింది. సింధు క్రాస్‌కోర్టు పాయింట్లపై ఆధారపడగా..యమగూచి విరామ సమయానికి 11-9తో ముందంజ వేసింది. 19-14తో తిరుగులేని స్థితిలో నిలిచిన యమగూచి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు విరామ సమయానికి 11-5తో ఆధిక్యంలో నిలిచింది. విరామం అనంతరం రేసులోకి వచ్చిన యమగూచి 11-13తో గట్టి పోటీనిచ్చింది. 16-16తో స్కోరు సమం కాగా.. మ్యాచ్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. టైబ్రేకర్‌లో సింధు పైచేయి సాధించింది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో అకానె యమగూచిపై సింధు ఎదురులేని ప్రదర్శన చేసింది. యమగూచిని చిత్తు చేసి 21-13తో తిరుగులేని విజయం నమోదు చేసింది. మూడో గేమ్‌తో పాటు సెమీఫైనల్స్ బెర్త్ కైవసం చేసుకుంది.