Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైపై రాయల్స్ గెలుపు
- టాప్-2లో చోటు కైవసం
నవతెలంగాణ-ముంబయి
రవిచంద్రన్ అశ్విన్ (40 నాటౌట్, 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఊరించే ఛేదనలో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. 151 పరుగుల ఛేదనలో అశ్విన్ అజేయ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానం సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్ 1 పోరుకు రంగం సిద్ధం చేసుకుంది. ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59, 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ బాదినా.. బట్లర్ (2), శాంసన్ (15), పడిక్కల్ (3) విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో అశ్విన్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాయల్స్‌కు విలువైన విజయాన్ని కట్టబెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మోయిన్ అలీ (93, 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఎం.ఎస్ ధోని (26, 28 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) నిరాశపరిచాడు. డెత్ ఓవర్లలో ధోని వేగంగా ఆడలేకపోయాడు. పదో పరాజయంతో చెన్నై సూపర్‌కింగ్స్ సీజన్ నుంచి నిష్క్రమించింది.
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 150/6 ( మోయిన్ అలీ 93, ఎం.ఎస్ ధోని 26, మెక్కారు 2/20, చాహల్ 2/26)
రాజస్థాన్ రాయల్స్ : 151/5 ( యశస్వి జైస్వాల్ 59, అశ్విన్ 40, ప్రశాంత్ సోలంకి 2/20, శాంట్నర్ 1/15)