Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్‌సీడ్ కార్ల్‌సన్‌పై మళ్లీ గెలుపు
న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్ మాస్టర్, 16ఏళ్ల ఆర్.ప్రజ్ఞానంద పెను సంచలనం నమోదు చేశాడు. ఈ ఏడాది వరుసగా రెండోసారి ప్రపంచ చాంపి యన్, టాప్‌సీడ్, ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగస్ కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఐదోరౌండ్ పోటీలో ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్ చేసిన ఒక్క తప్పిదంతో విజయం సాధిం చాడు. హోరాహోరీగా ఇద్దరూ తలపడడంతో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపించింది. కార్ల్‌సన్ 40వ మూవ్‌లో చేసిన తప్పిదం ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో 12 పాయింట్లతో భారత యువ గ్రాండ్ మాస్టర్ నాకౌట్ దశకు చేరువయ్యాడు. ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన 'ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్'లోనూ ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 16 ప్లేయర్లు పోటీపడుతుండగా.. ప్రజ్ఞానంద 3వ స్థానంలో కొనసాగుతున్నాడు.