Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీ సెమీస్‌లో భారత షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ పోటీలో 6వ సీడ్ సింధు 17-21, 16-21తో 3వ సీడ్ చెన్-యుఫీ(చైనా) చేతిలో వరుససెట్లలో ఓటమి పాలైంది. ఇరువురు షట్లర్ల మధ్య ఈ మ్యాచ్ 43నిమిషాలసేపు సాగింది. తొలిసెట్లో 6వ సీడ్ సింధు 3-3పాయింట్లతో సమంగా నిలిచినా.. ఆ తర్వాత అర్ధభాగం ముగిసే సమ యానికి 7-11పాయింట్లకు పడిపోయింది. ఆ ఆధిక్యతనే కోల్పోతూ.. 12-17 పాయింట్లకు సమర్పించుకుంది. రెండో సెట్లో సింధు తొలుత 6-3 ఆధిక్యతలో నిలిచినా.. ఆ తర్వాత 12-15పాయింట్లకు...చివర్లో 15-17కు పుంజు కున్నా.. 16-21కు చెన్-యుఫీకి సమర్పించుకుంది. మరో సెమీస్‌లో టాప్‌సీడ్ తైజు-యింగ్(చైనీస్ తైపీ) 10-21, 21-13, 21-19తో 7వ సీడ్ ఇంటనాన్(ఇండోనేషియా)పై గెలిచింది. ఫైనల్లో తైజు-చెన్-యుఫీతో తలపడనుంది. జకార్తా వేదికగా జూన్ 7-12మధ్య ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-500లో సింధు బరిలోకి దిగనుంది.