Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు.. ప్లే-ఆఫ్స్‌కు బెంగళూరు
వాంఖడే(ముంబయి): నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్స్ నిరాశపరిచారు. ప్లే-ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ముంబయి చేతిలో పరాజయాన్ని చవిచూసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ముంబయి జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ ఓటమితో ఢిల్లీ జట్టు ప్లే-ఆఫ్స్ నుంచి నిష్క్రమించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే-ఆఫ్స్‌కు చేరింది.
తొలుత టాస్ ఓడి తొలిగా బ్యాటిం గ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా-వార్నర్ భారీస్కోర్‌కు బాటలు వేయలేకపోయారు. ఫామ్‌లో ఉన్న వార్నర్(4), మిఛెల్ మార్ష్(0) త్వరగా పెవీలియన్‌కు చేరడంతో ఆ జట్టు 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మరో ఓపెనర్ పృథ్వీ షా(24) కూడా ఔటవ్వడంతో ఢిల్లీ జట్టు 31 పరుగులకే 3 వికెట్లు, సర్ఫరాజ్(10) కూడా నిరాశపరచడంతో జట్టు స్కోర్ 50 పరుగులకు చేరేసరికి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో రోవన్ పావెల్, కెప్టెన్ రిషబ్ పంత్ నిలకడగా ఆడి జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. రోమన్ పావెల్(43) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ 39 పరుగులు చేసి రమన్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అక్షర్ పటేల్(19; 10 బంతుల్లో 2ఫోర్లు) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి ఢిల్లీ జట్టు గౌరవప్రద స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. బుమ్రాకు మూడు, రమణ్‌దీప్ సింగ్‌కు రెండు, మార్కండే, సామ్స్‌కు తలా ఒక వికెట్ లభించాయి.
ఛేదనలో ముంబయి జట్టు తొలుత ఆచి తూచి ఆడినా.. వికెట్లను సమర్పించుకోకుండా జాగ్రత్త పడింది. ఇషాన్ కిషన్(48) రాణించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ (2పరుగులు; 13బంతులు) జాగ్రత్తగా ఆడాడు. బ్రెవీస్(37), తిలక్ వర్మ(21)కి తోడు చివర్లో టిమ్ డేవిడ్(34పరుగులు; 11బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశము హద్దుగా చెలరేగి ఆడి ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో ఢిల్లీ ఆశలు అడియాలయ్యాయి.
ప్లే-ఆఫ్స్
24మంగళ: గుజరాత్ × రాజస్తాన్
25బుధ: లక్నో × బెంగళూరు