Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు
ముంబయి : వరుస వైఫల్యాలతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఉద్వాసనకు గురైన టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా.. తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు చతేశ్వర్ పుజారాను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ 17 మందితో కూడిన టెస్టు జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతున్న చతేశ్వర్ పుజారా అక్కడ 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 720 పరుగులు చేశాడు. పుజారా బ్యాటింగ్ సగటు 120. ఇంగ్లాండ్ గడ్డపై సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారాను ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు ఎంపిక చేశారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఆడుతూ గాయపడిన అజింక్య రహానెకు జట్టులో చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. పేస్ దళంలో బుమ్రా, షమి, సిరాజ్, ఉమేశ్, శార్దుల్‌కు తోడు ప్రసిద్ కృష్ణ సైతం తోడయ్యాడు. తెలుగు తేజాలు హనుమ విహారి, కెఎస్ భరత్‌లు జట్టులో చోటు నిలుపుకున్నారు. పటౌడీ ట్రోఫీలో భారత్ ప్రస్తుతం 2-1తో ముందంజలో కొనసాగుతోంది. భారత్, ఇంగ్లాండ్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టు జులై 1-5న జరుగనుంది.
భారత టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ కృష్ణ