Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్ తడబాటు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ 157/8
ముంబయి : ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు. మిగిలిన మరో ఏడు మ్యాచుల్లో కనీసం మూడింటిలో నెగ్గితే ప్లే ఆఫ్స్‌లో చోటు లాంఛనం. ఇటువంటి పరిస్థితుల్లో వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజేతులా టాప్-4లో చోటు కోల్పోయింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ గాడిలో పడలేదు. అదే తడబాటుతో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (43, 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌న హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బరార్, నాథన్ ఎలిస్‌లు మూడేసి వికెట్లతో హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
అదే తడబాటు : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించాడు. ప్రియాం గార్గ్ (4) విఫలమవగా.. రాహుల్ త్రిపాఠి (20, 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అభిషేక్ శర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ ఎండ్‌లో అభిషేక్ దూకుడుగా ఆడగా.. మరో ఎండ్‌లో త్రిపాఠి స్ట్రయిక్‌రొటేషన్ చేశాడు. ఎడెన్ మార్కరం (21, 17 బంతుల్లో 2 ఫోర్లు) సైతం క్రీజులో నిలిచినా.. వేగంగా పరుగులు చేయటంలో తేలిపోయాడు. లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ (25, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఊపు తీసుకొచ్చాడు. రోమారియో షెఫర్డ్ (26 నాటౌట్, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌కు ధనాధన్ ముగింపు అందించాడు. నికోలస్ పూరన్ (5) నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బరార్ (3/26), నాథన్ ఎలిస్ (3/40) మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ప్రియాం గార్గ్ (సి) అగర్వాల్ (బి) రబాడ 4, అభిషేక్ శర్మ (సి) లివింగ్‌స్టోన్ (బి) బరార్ 43, రాహుల్ త్రిపాఠి (సి) ధావన్ (బి) బరార్ 20, ఎడెన్ మార్కరం (స్టంప్డ్) జితేశ్ (బి) బరార్ 21, నికోలస్ పూరన్ (సి) జితేశ్ (బి) ఎలిస్ 5, వాషింగ్టన్ సుందర్ (సి) ధావన్ (బి) ఎలిస్ 25, రోమారియో షెఫర్డ్ (సి) మంకడ్ (బి) ఎలిస్ 0, భువనేశ్వర్ రనౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-14, 2-61, 3-76, 4-87, 5-96, 6-154, 7-154, 8-156.
బౌలింగ్ : లివింగ్‌స్టోన్ 4-0-25-0, అర్షదీప్ సింగ్ 4-0-25-0, కగిసో రబాడ 4-0-38-1, నాథన్ ఎలిస్ 4-0-40-3, హర్‌ప్రీత్ బరార్ 4-0-26-3.