Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ పోరు డ్రా
- ఆసియా కప్ హాకీ 2022
జకర్తా : డిఫెండింగ్ చాంపియన్ హాకీ ఇండియాకు తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎదురైంది. హాకీ ఆసియా కప్ టైటిల్ డిఫెన్స్‌ను భారత్ డ్రాతో మొదలుపెట్టింది. గ్రూప్-ఏలో పాకిస్థాన్‌తో తలపడిన టీమ్ ఇండియా మ్యాచ్‌లో ఆఖరు వరకు విజయంపై దీమాగా కనిపించింది. 8వ నిమిషంలోనే భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. మరో నిమిషంలో ఆట ముగియనుండగా పాకిస్థాన్ అనూహ్య గోల్ కొట్టింది. 59వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న అబ్దుల్ రానా భారత గోల్‌పోస్ట్‌ను ఛేదించాడు. 1-1తో స్కోరు సమం చేశాడు. టీమ్ ఇండియా శిబిరాన్ని నైరాశ్యంలోని నెట్టాడు. మ్యాచ్‌లో తొలి గోల్ అవకాశం నిజానికి పాకిస్థాన్‌కే లభించింది. కానీ పెనాల్టీ కార్నర్‌ను పాక్ గోల్‌గా మలచలేదు. తొలి పెనాల్టీ కార్నర్‌ను వృథా చేసుకున్న భారత్..8వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. కార్తీ సెల్వం పెనాల్టీ కార్నర్ ఫ్లిక్ పాక్ డిఫెండర్ స్టిక్కు ముద్దాడుతూ గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ప్రథమార్థంలో లభించిన మరిన్ని పెనాల్టీ కార్నర్లను ఇరు జట్లు గోల్స్ చేయటంలో విఫలమయ్యాడు. ద్వితీయార్థంలో పాకిస్థాన్ దూకుడుగా ఆడినా.. భారత డిఫెన్స్‌ను ఛేదించటంలో తేలిపోయారు. గ్రూప్-ఏలో తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది.