Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ జట్టు సహాయక కోచ్‌గా నియమితులయ్యాడు. డానియల్ వెటోరీ, అండ్రీ బోరోవెక్లను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమిస్తూ మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్ తరఫున 113 టెస్టులు, 295 వన్డేలు ఆడిన విశేష అనుభవం కలిగిన వెటోరీ సేవలు, క్రికెట్ పరిజ్ఞానం ఆస్ట్రేలియాకు పనికొస్తాయని సీఏ వెల్లడించింది. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు అండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పని చేస్తున్న డానియల్ వెటోరీ.. ది హండ్రెడ్‌లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌కు చీఫ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. ప్రాంఛైజీ క్రికెట్లో కోచింగ్ బాధ్యతలు కొనసాగిస్తూనే.. క్రికెట్ ఆస్ట్రేలియా సహాయక కోచ్‌గా వెటోరీ సేవలు అందించనున్నాడు. వచ్చే నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌తో వెటోరీ ఆసీస్ బాధ్యతలు అందుకోనున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఇటీవల ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ టెస్టు జట్టుకు చీఫ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.