- చాంపియన్స్ టెస్ టూర్ చెన్నై : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో సంచలన విజయం నమోదు చేశాడు. ఏడాదిలో రెండోసారి ప్రపంచ చాంపియన్ మాగస్ కార్ల్‌సన్‌పై గెలుపొందిన ప్రజ్ఞానంద.. తాజాగా చైనా గ్రాండ్‌మాస్టర్ వీ యిపై విజయం సాధించాడు. 2.5-1.5తో చైనా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద చాంపియన్స్ చెస్ టూర్ చెస్‌ఏబుల్ మాస్టర్స్ 2022 ఆన్‌లైన్ టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 16 ఏండ్ల ప్రజ్ఞానంద సెమీఫైనల్లో నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ ఆనిశ్ గిరితో తలపడనుండగా.. వరల్డ్ నం.1 మాగస్ కార్ల్‌సన్‌తో డింగ్ లైరెన్ (చైనా) పావులు కదపనున్నాడు. మరో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు పి. హరికృష్ణ, విదిత్ గుజరాతీలు నాకౌట్ దశకు చేరుకోవటంలో విఫలమయ్యారు.