Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్‌ను తప్పించటంపై బీసీసీఐ వర్గాలు
ముంబయి : ఐపీఎల్ 15వ సీజన్ ముగియగానే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్. గతంలో శ్రీలంక పర్యటనలో భారత వైట్‌బాల్ జట్టుకు సారథ్యం వహించిన శిఖర్ ధావన్‌కే మరోసారి నాయకత్వ పగ్గాలు దక్కుతాయనే అంచనాలు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, జశ్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి లభించినా.. శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ కాదు కదా.. జట్టులో చోటే లభించలేదు. కెఎల్ రాహుల్ సారథ్యంలోని టీ20 జట్టులో శిఖర్ ధావన్‌ను తప్పించటం వెనుక చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి!. దశాబ్ద కాలంగా శిఖర్ ధావన్ జాతీయ జట్టుకు విశేష సేవలందించాడు. టీ20 ఫార్మాట్లో యువ తరానికి అవకాశాలు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైనందున.. ధావన్‌ను ప్రణాళికల్లో నుంచి తప్పిస్తున్నామని రాహుల్ ద్రవిడ్ సెలక్షన్ కమిటీ సమావేశంలో తెలిపినట్టు తెలుస్తోంది. ద్రవిడ్ సూచనతో ధావన్‌ను తప్పించినట్టు.. ఢిల్లీ స్టార్ బ్యాటర్‌కు ఆ విషయాన్ని సైతం రాహుల్ ద్రవిడే చెప్పినట్టు సమాచారం. సఫారీతో టీ20 సిరీస్‌కు దూరమైన శిఖర్ ధావన్.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌పై ఆశలు వదులుకున్నాడని చెప్పవచ్చు.