Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్, లక్నో మధ్య చావోరేవో
- నేడు కీలక ఎలిమినేటర్ సమరం
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్స్‌లో..
నవతెలంగాణ-కోల్‌కత : లీగ్ దశలో నిలకడగా విజయాలు సాధించి టాప్-4లో నిలిచిన జట్టు ఓవైపు. నిలకడలేని ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడిన జట్టు మరోవైపు. తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్న లక్నో సూపర్‌జెయింట్స్ కెఎల్ రాహుల్ సారథ్యంలో టైటిల్ విజయం దిశగా సాగాలని చూస్తోంది. గతంలో మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్లో ఆడినా చివరి అడుగు తడబాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ది. వరుసగా మూడో సీజన్లో ఎలిమినేటర్‌లో ఆడు తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కొత్త కెప్టెన్ సారథ్యంలో కొత్త ఫలితం సాధించాలని తపిస్తోంది. లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెం జర్స్ బెంగళూర్ నడుమ కీలక ఎలిమినేటర్ పోరు నేడు. ఎలిమినేటర ్లో ఓటమి చెందిన జట్టు ఇంటి దారి పట్టనుండగా.. నెగ్గిన జట్టు క్వాలిఫ యర్2కు అర్హత సాధించనుంది.
చావోరేవో : అటు బెంగళూర్‌కు, ఇటు లక్నోకు ఎలిమినేటర్ చావోరేవోగా మారింది. తుది జట్టులో నిలకడగా మార్పులు చేయకుండా జట్టులో ఆత్మ విశ్వాసం నింపిన డుప్లెసిస్.. బెంగళూర్‌ను భిన్నంగా నడిపిస్తున్నాడు. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మెరుపు అర్థ సెంచరీతో రాణించటం బెంగళూర్‌కు సానుకూలం. డుప్లెసిస్ టాప్ ఆర్డర్లో మెరిస్తే.. లోయర్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్ ధనాధన్ అండ ఉండనే ఉంది. బంతితో హజిల్‌వుడ్, హర్షల్ పటేల్, హసరంగ రాణిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ మెరిస్తే బంతితోనూ బెంగళూర్‌కు తిరుగుండదు. లక్నోకు ఓపెనర్లు రాహుల్, డికాక్ కొండంత బలం. యువ పేసర్లు అవేశ్ ఖాన్, మోషిన్ ఖాన్లు అద్వితీయంగా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో దీపక్ హుడా మినహా మరో బ్యాటర్ ఫామ్‌లో లేకపోవటం లక్నోకు బలహీనత. లీగ్ దశలో లక్నో, బెంగళూర్ ముఖాముఖి పోరులో బెంగళూర్ సాధికారిక విజయం సాధించింది. మరి ఎలిమినేటర్‌లో గెలిచి నిలిచేదెవరో చూద్దాం.