Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేరీకోమ్‌తో నిఖత్ జరీన్ ఫొటో వైరల్
హైదరాబాద్: భారత టాప్ మహిళా బాక్సర్, ఒలింపిక్స్ పతక విజేత మేరీకోమ్‌తో కలిసి నిఖత్ జరీన్ ఉన్న ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'గోల్డ్ మెడల్ గెలిచినందుకు కంగ్రాట్స్ నిఖత్. నీ చారిత్రాత్మక ప్రదర్శన ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులోనూ అపూర్వ విజయాలు సాధించాలి'' అని ట్వీట్ చేసింది. దీనికి రిప్లైగా మేరీకోమ్‌తో కలిసి దిగిన ఫొటోను నిఖత్ జరీన్ ట్విటర్లో షేర్ చేసింది. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. గతంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు క్వాలిఫయిర్‌కు సంబంధించి నిఖత్, మేరీ కోమ్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ట్రయల్స్ నిర్వహించకుండా నేరుగా మేరీకోమ్‌ను ఒలింపిక్స్‌కు ఎలా పంపుతారంటూ నిఖత్ ప్రశ్నించడంతో మేరీకోమ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు మధ్య ఎట్టకేలకు ట్రయల్స్ నిర్వహించారు. ట్రయల్స్‌లో మేరీకోమ్ గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం నిఖత్‌తో చేయి కలపడానికి కూడా మేరీకోమ్ ఇష్టపడలేదు. ''నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి? ఒకవేళ ఆమెకు గౌరవం కావాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. అలాంటి వారిని నేను అంతగా ఇష్టపడను. కేవలం నీ సత్తా ఏంటో రింగ్‌లో నిరూపించుకో.. అంతేకానీ బయట కాదు'' అని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారం పతకం గెలిచిన ఐదో భారత మహిళా బాక్సర్‌గా నిఖత్ నిలవడంతో మేరీకోమ్ శుభాకాంక్షలు తెలపడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.