Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోపై 14 పరుగుల తేడాతో విజయం
- ఫైనల్ బెర్త్‌కోసం 27న రాజస్తాన్‌తో ఢీ
- పటీదర్ అజేయ సెంచరీ
కోల్‌కతా: ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు సమిష్టిగా రాణించింది. అదృష్టం కొద్దీ ప్లే-ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న బెంగళూరు జట్టు బుధవారం జరిగిన ఎలిమినేటర్-1లో లక్నోపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో లక్నో జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6వికెట్లు కోల్పోయి 193పరుగులే చేయగల్గింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత యువ బ్యాటర్ రజత్ పటీదర్ లక్నో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని చివరి వరకు క్రీజ్‌లోనే ఉన్నాడు. మొత్తంగా 54 బంతులను ఆడిన పటిదర్... 12 ఫోర్లు, 7సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్(37నాటౌట్) ఈ మ్యాచ్‌లోనూ బ్యాటును ఝుళిపించాడు. విరాట్ కోహ్లీ (25) ఫరవాలేదనిపించాడు. చమీర 4 ఓవర్లు వేసి 54 పరుగులు, రవి బిష్ణోయి 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చాడు. అవేశ్ ఖాన్, కృనాల్ పాం డ్యా, మోహిసిన్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. ఛేదనలో లక్నో జట్టు ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కేఎల్ రాహుల్(79)కి తోడు హుడా(45) క్రీజ్‌లో నిలిచినంతసేపు లక్నో గెలిచే కనిపించింది. హుడా, రాహుల్ ఔటవ్వడంతో ఇన్నింగ్స్ లక్నో ఇన్నింగ్స్ మందగించింది. హేజిల్‌వుడ్ ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాను ఔట్ చేసాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కారణం సుమారు గంటసేపు మ్యాచ్ నిలిచిపోయింది. హేజిల్‌వుడ్‌కు మూడు, సిరాజ్, హసరంగ, హర్షల్ పటేల్‌కు తలా ఒక వికెట్ లభించాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పటీదర్కు లభించింది.
డుప్లెసిస్ గోల్డన్ డక్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్(0) గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. మెహిసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లో ఐదో బంతికి డుప్లెసిస్ వికెట్ కీపర్‌కి చిక్కాడు. డుప్లెసిస్ ఎదుర్కొన్న తొలి బంతికే డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (సి)మొహిసిన్ ఖాన్ (బి)ఆవేశ్ ఖాన్ 25, డుప్లెసిస్ (సి)డికాక్ (బి)మొహిసిన్ ఖాన్ 0, రజత్ పటీదర్ (నాటౌట్) 112, మ్యాక్స్‌వెల్ (సి)లెవీస్ (బి)కృనాల్ పాండ్యా 9, లామ్రోర్ (సి)రాహుల్ (బి)బిష్ణోరు 14, దినేశ్ కార్తీక్ (నాటౌట్) 37, అదనం 10. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 207పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/70, 3/86, 4/114
బౌలింగ్: మొహిసిన్ ఖాన్ 4-0-25-1, ఛమీర 4-0-54-0, కృనాల్ పాండ్యా 4-0-39-1, ఆవేశ్ ఖాన్ 4-0-44-1, రవి బిష్ణోరు 4-0-45-1,
లక్నో సూపర్‌జెయింట్స్: డికాక్ (సి)డుప్లెసిస్ (బి)సిరాజ్ 6, కేఎల్ రాహుల్ (సి)షాబాజ్ (బి)హేజిల్‌వుడ్ 79, వోవ్రా (సి)షాబాజ్ (బి)హేజిల్‌వుడ్ 19, దీపక్ హుడా (బి)హసరంగ 45, స్టోయినీస్ (సి)పటీదర్ (బి)హర్షల్ పటేల్ 9, లెవీస్ (నాటౌట్) 2, కృనాల్ పాండ్యా (సి అండ్ బి)హేజిల్‌వుడ్ 0, ఛమీర (నాటౌట్) 11, అదనం 22. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 193పరుగులు.