Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాయల్‌ సమరం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

రాయల్‌ సమరం

Fri 27 May 00:31:01.167074 2022

           ప్లే ఆఫ్స్‌లో చోటుపై సందిగ్థత. టాప్‌-4లో నిలిచేందుకు ముంబయి ఇండియన్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి. గత వారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పొజిషన్‌ ఇది. వరుసగా మూడో సీజన్‌లో ఎలిమినేటర్‌లో పోటీపడిన బెంగళూర్‌.. మూడో ప్రయత్నంలో క్వాలిఫయర్‌2కు చేరుకుంది. అహ్మదాబాద్‌ మెగా ఫైనల్లో అడుగుపెట్టేందుకు బెంగళూర్‌కు ఇప్పుడు రాజస్థాన్‌ రాయల్సే అడ్డు!. స్టార్‌ క్రికెటర్లపై ఆధారపడుతూ ప్రతి సీజన్‌లో భంగపడుతున్న బెంగళూర్‌.. ఈ సీజన్‌లో అనూహ్య హీరోల ప్రదర్శనలతో టైటిల్‌ ఫేవరేట్‌గా నిలిచింది. ఫైనల్లో బెర్త్‌ కోసం నేడు రాయల్‌ చాలెంజర్‌ బెంగళూర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లు 'రాయల్‌ సమరానికి' సిద్ధమయ్యాయి. మోతెరా మైదానంలో క్వాలిఫయర్‌2 పోరు నేడే.
  ఫైనల్స్‌పై కన్నేసి బెంగళూర్‌, రాజస్థాన్‌ ఢ
  టైటిల్‌ పోరుకు చేరాలని ఇరు జట్ల తహతహ
  రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
నక్కి నక్కి.. తొంగి తొంగి కాదు!. తొక్కుకుంటూ పోవాలె!!. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ప్రస్తుతం ఇదే పద్దతిని అనుసరిస్తున్నట్టు అనిపిస్తోంది. ప్లే ఆఫ్స్‌కు కష్టంగా చేరుకున్న బెంగళూర్‌.. నాకౌట్‌ దశలో అనూహ్య ప్రదర్శన చేసింది!. ఎలిమినేటర్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఈ సారి టైటిల్‌ కొట్టేందుకు సిద్ద మవుతోంది!. మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ సైతం ఫైనల్లో కాలుమోపేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. క్వాలిఫయర్‌1లో టైటాన్స్‌ చేతిలో దెబ్బతిన్న సంజు శాంసన్‌ సేన.. నేడు బెంగళూర్‌ను కొట్టేసి టైటిల్‌ పోరుకు చేరుకోవాలని చూస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌, బెంగళూర్‌ తలపడిన రెండు మ్యాచుల్లో చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ఏకంగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నేడు క్వాలిఫయర్‌2లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. స్టార్‌ ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ను స్టార్‌ క్రికెటర్లు పేలవ ఫామ్‌లో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ దాటేస్తుందేమో చూడాలి.
రెట్టింపు ఉత్సాహంలో..!
విరాట్‌ కోహ్లి, డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌.. బెంగళూర్‌ స్టార్‌ క్రికెటర్లు. ఎలిమినేటర్‌లో ఈ ముగ్గురు నిరాశపరిచారు. దీంతో సహజంగానే బెంగళూర్‌ కథ అక్కడితోనే ముగిసిందనే భావన కలిగింది. అనామక ఆటగాడు రజత్‌ పటీదార్‌పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కానీ సాహాసోపేతమైన ఇన్నింగ్స్‌తో అజేయ శతకం సాధించాడు. పటీదార్‌ సంచలన ఇన్నింగ్స్‌తో బెంగళూర్‌ను గెలుపు తీరాలకు చేర్చటంతో పాటు.. బెంగళూర్‌ శిబిరంలో కొండంత ఆత్మవిశ్వాసం సైతం నింపాడు. డెత్‌ ఓవర్ల విధ్వంసకారుడు దినేశ్‌ కార్తీక్‌ తన పని తాను కానిచ్చాడు. ప్రధాన పేసర్‌ హర్షల్‌ పటేల్‌ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. డెత్‌ ఓవర్లలో హర్షల్‌ పటేల్‌ జోరు ఏమాత్రం తగ్గలేదు. లెగ్‌ స్పిన్నర్‌ వానిందు హసరంగ, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లకు రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌పై మంచి రికార్డుంది. అంచనాలు లేని ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న తరుణంలో స్టార్‌ క్రికెటర్లు సైతం బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో మెరిస్తే.. నేడు క్వాలిఫయర్‌2లో బెంగళూర్‌కు ఎదురుండదు.
రాయల్స్‌ పుంజుకునేనా?!
ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా రాజస్థాన్‌ రాయల్స్‌ టాప్‌-2లో నిలిచింది. క్వాలి ఫయర్‌1లో ఆడింది. ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌పై ఆరంభంలో జోశ్‌ బట్లర్‌ నెమ్మదైన ఇన్నింగ్స్‌, చివర్లో ధనాధన్‌ హిట్లర్‌ కొరత రాయల్స్‌ను ఫైనల్స్‌కు చేరకుండా నిలువరించింది!. గుజరాత్‌ టైటాన్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు, ఫైనల్స్‌కు చేరుకునేందుకు రాయస్థాన్‌ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. స్టార్‌ బ్యాటర్‌ జోశ్‌ బట్లర్‌ ఫామ్‌లోకి రావటం సానుకూలం. కానీ అతడు పవర్‌ప్లే నుంచే పవర్‌ఫుల్‌ ఇన్నింగ్స్‌ ఆడాలని రాయల్స్‌ కోరుకుంటోంది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ ధనాధన్‌ సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ కీలక క్వాలిఫయర్‌2లో ఒకట్రెండు ఓవర్లలో మెరుపులు సరిపోవు. నిలకడగా బౌలర్లపై దండయాత్ర చేస్తేనే ముందుకు వెళ్లగలం. ఆ విషయం రాయల్స్‌ కెప్టెన్‌కు బాగా తెలుసు!. బౌలర్లు ప్రసిద్‌ కృష్ణ, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈడెన్‌లో సరైన చోట బంతులు వేయటంలో తడబడ్డారు. మోతెరాలోనైనా మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను అందుకుంటే రాయల్స్‌కు అంతకంటే గొప్ప ఉపశమనం ఉండదు. ఈ సీజన్‌లో స్పిన్‌తో ప్రత్యర్థులను హడలెత్తించిన జట్లలో రాజస్థాన్‌, బెంగళూర్‌ ముందు న్నాయి. రాయల్స్‌ 38 వికెట్లు తీసుకోగా.. రాయల్‌ చాలెంజర్స్‌ 35 వికెట్లు కూల దోసింది. ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల ఫార్ములా క్వాలిఫయర్‌1లో బెడిసికొట్టింది. క్వాలిఫయర్‌2లో సంజు శాంసన్‌ తుది జట్టు కూర్పు మార్పు చేస్తాడా? అదే కాంబినేషన్‌తో వస్తాడా? చూడాలి.
పిచ్‌, వాతావరణం
మోతెరా మైదానం గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు సొంత గడ్డ. ఇక్కడ 12 మ్యాచులు ఆడిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఏడు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. మోతెరా మైదానం పూర్తిగా కొత్తగా మారటంతో ఇక్కడి పరిస్థితులకు వేగంగా అలవాటు పడటం అటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌కు అవశ్యం. వాతావరణం పరంగా ఈడెన్‌గార్డెన్స్‌తో పోల్చితే అహ్మదాబాద్‌లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయి!. క్వాలిఫయర్‌2కు వర్షం ఆటంకం ఉండకపోవచ్చు. 2021 నుంచి ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఆరు సార్లు గెలుపొందగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టును విజయం 11 సార్లు వరించింది. టాస్‌ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ఛేదనకు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రజత్‌ పటీదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మహిపాల్‌ లామ్రోర్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, జోశ్‌ హజిల్‌వుడ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
రాజస్థాన్‌ రాయల్స్‌ : జోశ్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వెంద్ర చాహల్‌, ఒబెడ్‌ మెక్‌కారు, ప్రసిద్‌ కృష్ణ.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముంబయి ఎదురీత
సిరీస్‌ చిక్కింది
భారత్‌కు ఎదురుందా?
ఉత్కంఠగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
పంత్‌ ఫటాఫట్‌
ఐపీఎల్‌పై పీసీబీ అభ్యంతరం?
ఖతార్‌ సూపర్‌ విక్టరీ
శతక జోరు
అమ్మాయిల గెలుపు
రాణించిన భరత్‌, కోహ్లి
టాప్‌-10లో ఇషాన్‌ కిషన్‌
ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3
సర్ఫరాజ్‌ సెంచరీ
ఆసియా హ్యాండ్‌బాల్‌ షురూ
సన్నద్ధత సమరం!
యశస్వి జైస్వాల్‌ అర్థ శతకం
సెప్టెంబర్‌లో జాతీయ క్రీడలు?
చివరి సవాల్‌
రంజీ చాంపియన్‌ ఎవరో?
జింఖానా అథ్లెట్ల సత్తా
అశ్విన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌
ఆ డబ్బు ఏం చేస్తారు?
పంత్‌ ప్రణాళికల్లో భాగం!
మన్‌ప్రీత్‌ సారథ్యంలో..
ఆశలపై వర్షం
హెచ్‌సీఏలో మళ్లీ రగడ
పోరాడి ఓడిన అమ్మాయిలు
నీరజ్‌ చోప్రాకు పసిడి
సాహా ద్విపాత్రాభినయం?
ఐపీఎల్‌ బాటలో ఐసీసీ!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.