Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేల్చి చెప్పిన వృద్దిమాన్ సాహా
కోల్‌కత : సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ వృద్దిమాన్ సాహా బెంగాల్ రంజీ జట్టును వీడేందుకు సిద్ధమవుతున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఉన్నతాధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలకు తీవ్ర మనస్థానం చెందిన సాహా.. నిరభ్యంతర పత్రము కోరినట్టు తెలుస్తోంది. 37 ఏండ్ల వృద్దిమాన్ సాహాను 2021-22 రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో ఆడేందుకు బెంగాల్ ప్రయత్నిస్తోంది. బెంగాల్ రంజీ జట్టులో సాహా పేరును చేర్చింది. భారత జట్టులో లేకపోయినా బెంగాల్ తరఫున రంజీలు ఆడేందుకు సాహా సాకులు చెబుతున్నాడని, అతడికి బెంగాల్‌పై ప్రేమ లేదని ఓ అధికారి విమర్శించిన సంగతి తెలిసిందే. సాహాను క్యాబ్ సీనియర్ క్రికెటర్‌గా గౌరవిస్తోందని, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర సంఘానికి సంబంధం లేదని సాహాకు క్యాబ్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా తెలిపాడు. అయినా, సాహా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. జూన్ 6న బెంగళూర్ వేదికగా జార్ఖండ్‌తో బెంగాల్ క్వార్టర్‌ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఈ సమయంలో సీనియర్ క్రికెటర్ సాహా బెంగాల్‌ను వీడాలని నిర్ణయించుకోవటం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ కానుంది.